ప్రమాదంలో ప్రభుత్వ విద్యా రంగం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ విద్యారంగం ప్రమాదంలో ఉందని, దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్. కుసుమకుమారి పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారంజరిగిన విస్తృత కార్యవర్గ సమాశంలో ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడారు. సంస్కరణల ముసుగులో తరగతుల తరలింపు తగదన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులు ఉండాల్సి ఉండగా, 3,4,5 తరగతులను విడదీయాలని ఏ ఒక్క కమిషన్, విద్యావేత్త చెప్పలేదని తెలిపారు. శాసనమండలితో పాటు సమాజంలోనూ విద్యారంగం బలోపేతానికి పాటుపడే పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌రావు, ఎం. కళాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం కనీసం పీఆర్సీ కమిటీని సైతం వేయకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం ఉద్యోగులపై నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశివరావు, గోవిందయ్య, రంగారావు, ప్రసాద్, కేదార్‌నాథ్, ఏ.శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు కుసుమకుమారి
Comments
Please login to add a commentAdd a comment