గిట్టుబాటు ధరలేక నష్టపోతున్న రైతులు
వరంగల్ చౌరస్తా: వ్యవసాయ రంగంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ పంటలు పండిస్తున్న రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. గురువారం వరంగల్ నగరంలోని అబ్బనికుంటలోని తెలంగాణ రైతు సంఘం భవనంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని, కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలే కొనుగోలు చేసి వ్యాపారులకు అమ్మాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా ప్రజల సమస్యలు తీరలేదని, రైతులు, అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఇన్సూరెన్స్ పాలసీలు లేవని, కౌలు రైతుల పరిస్థితి మరింత ఆందోళనకారంగా ఉందన్నారు. పరిశ్రమల పేరుతో రైతుల భూములను లాక్కోవడం సరికాదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలు, హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువుల వాడకంతో అధిక దిగుబడి వచ్చినా రైతులకు మేలు జరగడం లేదని అన్నారు. సమావేశంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, రైతు సంఘాల నాయకులు రాచర్ల బాలరాజు, ఓదెల రాజయ్య, బాబురావు, సోమ రామ్మూర్తి, హంసా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ –4 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
నయీంనగర్: టీజీపీఎస్సీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిప్టార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందిన వరంగల్ రీజియన్ (వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్)కు చెందిన 1,041 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను గురువారం కుడా కాంప్లెక్స్‌లోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో వెరిఫికేషన్ చేశారు. ఇదిలా ఉండగా.. సీడీఎంఏ అయిదుగురు జూనియర్ అసిస్టెంట్లను కుడా కార్యాలయానికి కేటాయించింది. వారిలో గురువారం ముగ్గురు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
లైబ్రరీ చాలా ఉపయోగపడింది..
నాకు వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. వరంగల్ జైలు దగ్గరి లైబ్రరీలోనే నేను ప్రిపేర్ అయ్యాను. లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడింది.
– కల్లెపు వరుణ్, హనుమకొండ
Comments
Please login to add a commentAdd a comment