పంచారామాలకు సూపర్ లగ్జరీ బస్సు
కాజీపేట అర్బన్ : కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలను సందర్శించే భక్తు ల సౌకర్యార్థం పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని పంచారామ క్షేత్రాలు అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి, భీమవరంలోని సోమేశ్వర స్వామి, పాలకొల్లులోని క్షీర లింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని భీమేశ్వరస్వామి దేవాలయాలను దర్శించుకునేందుకు ఈనెల 27వ తేదీన లగ్జరీ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈనెల 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు హనుమకొండ బస్సు స్టేషన్ నుంచి బయలుదేరి గురువారం పంచరామ దర్శనం అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి హనుమకొండ బస్సు స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. పంచారామ దర్శనానికి పెద్దలకు రూ. 2300, పిల్లలకు రూ. 1400 చార్జీ ఉంటుందని, బుకింగ్ కోసం సర్వీస్ నంబర్ 94444 ద్వారా ఆన్‌లైన్‌లో tgsrtconline.in, వివరాలకు 7382855492, 9959226056, 9959 226047 నంబర్లలో సంప్రదించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment