రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
● మజ్దూర్ యూనియన్ డివిజన్ సెక్రటరీ రవీందర్
కాజీపేట రూరల్: రైల్వే కార్మికుల సమస్యల పరి ష్కారమే ధ్యేయమని మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ అన్నారు. శనివారం కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్ గేట్ ఎదు ట యూనియన్ డీజిల్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్‌కె. జానీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ డిసెంబర్ 4, 5వ తేదీల్లో జరిగే వన్ యూనియన్ వన్ ఇండస్ట్రీయల్ ఎన్నికల్లో జెండా గుర్తును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో డీజిల్ బ్రాంచ్ సెక్రటరీ పి.వేదప్రకాశ్, ట్రెజరర్ జి.రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, తిరుపతి, గుర్రం నాగరాజు, దువ్వ వెంకట్, అశోక్, ఎన్.రాజు, తదితరులు పాల్గొన్నారు.
అంతర్ కళాశాలల బాక్సింగ్ పోటీలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని అంతర్ కళాశాలల బాక్సింగ్ పోటీలు శనివా రం (పురుషులు, మహిళలు ) హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో నిర్వహించారు. ఈ పోటీలను కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ప్రారంభించారు. ఫిజికల్ డైరెక్టర్లు సునీల్‌రెడ్డి, అంబాల రాజేశ్, రమేశ్ పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో 27 మంది పురుషులు, 25 మంది మహిళలు ప్రతిభ చాటారు. విజేతలను సౌత్‌జోన్ ఇంటర్ యూని వర్సిటీ పోటీలకు ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment