వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో వరంగల్ జిల్లాస్థాయి సబ్‌జూనియర్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ ఊర యుగేంధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12 బాలబాలికల విభాగాల్లో ఎంపిక పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్–8 కేటగిరీలో బాలబాలికలకు 50 మీటర్ల పరుగు, 300 మీటర్ల పరుగు, కిడ్స్ జావెలిన్‌త్రో, అండర్–10 విభాగంలో బాలబాలికలకు 100 మీటర్ల పరుగు, 300 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–12 విభాగంలో బాలబాలికలకు 100 మీటర్ల రన్నింగ్, 400 మీటర్ల రన్నింగ్, 600 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, జావెలిన్‌త్రో ఈవెంట్లలో పోటీలు ఉంటాయని తెలిపా రు. అండర్–8 విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 2 డిసెంబర్ 2016 నుంచి 1 డిసెంబర్ 2018 మధ్య జన్మించిన వారు, అండర్–10 విభాగంలో 2 డిసెంబర్ 2014 నుంచి 1 డిసెంబర్ 2016 మధ్య జన్మించిన వారు, అండర్–12 కేటగిరీలో పాల్గొనే క్రీడాకా రులు 1 డిసెంబర్ 2012 నుంచి 1 డిసెంబర్ 2014 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు వెంట తీసుకునిరా వాలని కోరారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను డిసెంబర్ 1వ తేదీన మంచిర్యాలలో జరగనున్న 10వ తెలంగాణ రాష్ట్ర సబ్‌జూనియ ర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారుల తమ పేర్లు రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం యుగేంధర్‌రెడ్డి మొబైల్ నంబర్ 98665 64422, పి.మహేందర్ 96188 28299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment