భద్రకాళి చెరువులో కబ్జా చేసిన వారిపై చర్యలు
‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
నయీంనగర్: భద్రకాళి చెరువులో కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, చెరువును సర్వే చేయించి అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి తెలిపారు. వరంగల్ భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం, కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్ అశ్విని తానాజీ వాకడే, అఽధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్మన్ మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేస్తామని, చెరువును తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం తెస్తామని, రూ.1.60 కోట్లతో చేపట్టిన పనులు 90 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే రెండు మ్యూజికల్ ఫౌంటేన్లు గార్డెన్ వెనుక భాగంలో ఒకటి, మధ్యలో ఒకటి ఏర్పాటు చేసి త్వరలో గార్డెన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. వారి వెంట ‘కుడా’ సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment