నగరాభివృద్ధికి సహకారం అందించండి
● స్వచ్ఛ భారత్, గ్రీన్ బడ్జెట్‌కు నిధులు కేటాయించండి
● 16వ ఆర్థిక సంఘం సమావేశంలో మేయర్ సుధారాణి
వరంగల్ అర్బన్: వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని నగర మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో 10 లక్షలలోపు జనాభా కలిగిన నగరాల కేటగిరీలో మంగళవారం జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరం చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉందని, విద్య, వైద్యం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నగర విస్తీర్ణం 407.7 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందని, 2024 నాటికి నగర జనాభా 10.48 లక్షలకు పెరుగుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి, పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి కార్పొరేషన్ తరఫున కృషి చేస్తున్నట్లు వివరించారు. నగరంలో అభివృద్ధి పనులకు డీపీఆర్‌లు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. యూజీడీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.4,170 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. వరద నీటి కాల్వలు, సరస్సులు, నీటి వనరుల పునరుద్ధరణ, నీటి సరఫరాకు అదనంగా రూ.రూ.5 వేల కోట్లు అవసరమని చెప్పారు. బల్దియాకు 16వ ఆర్థిక సంఘం కింద రూ.5వేల కోట్లు మంజూరు చేయాలని మేయర్ కోరారు. రూ.100 కోట్ల స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు కావాలని, గ్రీన్ బడ్జెట్ చెల్లింపు కోసం నిధులు ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment