ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి న్యూఢిల్లీ నుంచి రాష్ట్రంలోని మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీసీ అనంతరం అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సత్యశారద సమీక్షించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం ఎంత వస్తోంది.. ఇంకా ఎంత ధాన్యం రావాల్సి ఉందనే నివేదికలు అందజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సీపీఓ గోవిందరాజన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డీఎస్‌ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, డీఎంఓ సురేఖ, డీసీఓ నీరజ, ఆర్డీఓలు ఉమారాణి, సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ కావు..
వరంగల్: ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు ట్యాంపరింగ్ కావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని వరంగల్ కలెక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసిందని తెలిపారు. ఈ తీర్పు ఈవీఎంల విశ్వసనీయతకు మద్దతుగా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగుతుందనడానికి రుజువుగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment