![మినీ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10mul103-330120_mr-1739216835-0.jpg.webp?itok=_aN57H-i)
మినీ మేడారానికి సిద్ధం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ కూడా బస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచారు.
అడుగడుగునా నిఘా..
మేడారంలో భక్తుల రద్దీ, దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. ఫుటేజీలను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తాత్కాలిక డ్రెస్సింగ్ గదుల ఏర్పాటు
జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద భక్తులు దుస్తులు మార్చుకునేందుకు జీఆర్ షీట్స్‌తో 10 తాత్కాలిక డ్రెస్సింగ్ గదులను అందుబాటులో ఉంచారు. భక్తుల జల్లు స్నానాల కోసం కూడా 10 బాటరీ ఆఫ్ ట్యాప్‌లను ఏర్పాటు చేశారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోళ్ల్లు, మేకల వ్యర్థాలను వేసేందుకు వ్యాపారస్తులకు డస్ట్‌బిన్లను పంపిణీ చేశారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవార్లకు మొక్కుగా కోళ్లను సమర్పించడంతో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు వేయకుండా షాపుల వద్ద డస్ట్‌బిన్లను ఏర్పాటు చేశారు. గద్దెల సమీపంలో, రోడ్ల వెంట, భక్తులు విడిది చేసే షెడ్ల వద్ద ఈగలు, దోమలు వ్యాపించకుండా కెమికల్ పిచికారీ చేశారు.
ముగింపు దశకు చేరుకున్న పనులు
రేపటినుంచి 15వ తేదీ వరకు జాతర
భద్రత.. భారీగా
జాతర విధులకు
వెయ్యి మంది సిబ్బంది
బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న బందోబస్తు
– 8లోu
![మినీ మేడారానికి సిద్ధం1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10mul107-330120_mr-1739216835-1.jpg)
మినీ మేడారానికి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment