![వినతులు తక్షణమే పరిష్కరించండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10wgl101rr-330080_mr-1739216835-0.jpg.webp?itok=u7Ac_18m)
వినతులు తక్షణమే పరిష్కరించండి
కమిషనర్ అశ్విని తానాజీ వాకడే
వరంగల్: ప్రజల వినతులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో కమిషనర్ పాల్గొని వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. గ్రీవెన్స్‌లో ఇంజనీరింగ్ 16, హెల్త్–శానిటేషన్ 8, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) 11, టౌన్ ప్లానింగ్ 32, మంచినీటి సరఫరా 7, హార్టికల్చర్ 1 తో మిగిలిన విభాగాలకు మొత్తం 75 వినతులు వచ్చినట్లు సంబంధిత విభాగాధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, హెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, పన్నుల అధికారి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment