సాక్షి, సిటీబ్యూరో: జపాన్‌కు చెందిన మొట్ట మొదటి వ్యవసాయ రసాయన ఆధారిత పరిశోధన సంస్థ ఎన్‌ఎన్‌సీ ఆధ్వర్యంలోని నిచినో ఇండియా అగ్రోకెమికల్స్ నూతన తయారీ ప్లాంట్‌ను హున్మూబాద్‌లో ప్రారంభించారు. బుధవారం జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో గ్లోబల్ ప్రెసిడెంట్ హిరోయుకి ఇవాటా శాన్‌తో పాటు జపాన్–భారత్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ., ఈ కర్మాగారం కీటకనాశిని, శిలీంద్రనాశినులు, ఇంటర్మీడియట్లను ఉత్పత్తి చేయడానికి బహుళ స్థాయి వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ హైటెక్ కర్మాగారం ఏటా దాదాపు 250 కోట్ల ప్రొప్రైటరీ టెక్నికల్ గ్రేడ్ మెటీరియల్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. పర్యావరణహితమైన డెడికేటెడ్ ఆసిడ్ రికవరీ సిస్టమ్, డస్ట్ ఫ్రీ బ్లాకులు, నౌటా డ్రెయర్లు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి పద్దతులను పాటిస్తున్నామన్నారు. తమ మాతృ సంస్థ నివోన్ నొవోన్ నొహ్ యకు కార్పొరేషన్ (ఎన్‌ఎన్‌సీ) వందకు పైగా దేశాల్లోని రైతులకు సేవలందిస్తుందన్నారు. నిచినో ఇండియా పదేళ్ల పరిశోధన తర్వాత ఇటీవల నూతన సక్రియ పదార్థమైన బెంజొపైరిమోక్సన్‌ను ఆవిష్కరించింది. సుడిదోమ వంటి కీటకాలను నాశనం చేయడానికి తాము తయారు చేసిన ‘ఆర్చెస్ట్రా’ ఉత్తమమైనదని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీనిని తయారు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment