నయాపూల్‌ టు చార్మినార్‌ | - | Sakshi
Sakshi News home page

నయాపూల్‌ టు చార్మినార్‌

Published Wed, Nov 13 2024 5:20 AM | Last Updated on Wed, Nov 13 2024 5:20 AM

-

● ఆర్కిటెక్చరల్‌ లైటింగ్‌తో వెలుగు జిలుగులు ● రూ.8.19 కోట్లతో త్వరలో పనులు

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక ప్రశస్తి కలిగిన నయాపూల్‌ నుంచి చార్మినార్‌ వరకు, లాడ్‌బజార్‌, చార్మినార్‌ సమీపంలోని నాలుగు ఆర్చిలు, పరిసరాల్లోని ఇతరత్రా ఐకానిక్‌ ప్రాంతాలను ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్‌ లైటింగ్‌తో, వెలుగు జిలుగులతో ఆ ప్రాంతాలకు మరింత ప్రత్యేకతను అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని ఐకానిక్‌ ప్రాంతాల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ పనులు చేపట్టనున్నారు. కులీకుతుబ్‌షా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నివేదించిన వివరాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ పనులకు రూ.8.19 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. బీఓక్యూ విధానంలో టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సూచించింది. ఎన్‌టీపీసీ సీఎస్సార్‌ నిధులను ఇందుకు వినియోగించాల్సిందిగా సూచించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement