ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్‌ | Sakshi
Sakshi News home page

ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్‌

Published Tue, May 7 2024 7:05 PM

ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్‌

పంజగుట్ట: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేస్తూ భారతీయులను విడదీసే వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్‌ అథవాలే అన్నారు. మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగం మారుస్తారని అసత్య ప్రచారం చేస్తూ మనషుల మధ్య వైరుధ్యం పెంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీపై ఇప్పటికే ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్పారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ముట్టుకోకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, నేతలు శ్రీధర్‌, నాగేశ్వరరావు, శ్రీలత, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్‌ అథవాలే

 
Advertisement
 
Advertisement