9 ఏళ్లలో 2,500 స్టార్టప్‌లు
టీహబ్ ఇన్‌చార్జి సీఈఓ సుజిత్ జాగీర్దార్
రాయదుర్గం: గత 9 ఏళ్లలో 2,500 స్టార్టప్‌లు రూపుదాల్చుకునేలా ప్రోత్సహించినట్లు టీహబ్ ఇన్‌చార్జి సీఈఓ సుజిత్ జాగీర్దార్ స్పష్టం చేశారు. గురువారం బ్రిటిష్ కౌన్సిల్, సోషల్ అల్ఫా, ఎన్‌ఎస్‌ఈ, టీహబ్ సంయుక్తాధ్వర్యంలో నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో సస్టెయినబిలిటీ ఇంపాక్ట్ మ్యాటర్స్ రోడ్‌షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టార్టప్‌లకు సంబంధించినంత వరకు ప్రభావం అనేక విధాలుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం టీహబ్‌లో ఇంక్యుబేట్ అవుతున్న మరో 500 స్టార్టప్‌ల్లో చాలా వరకు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. స్థిరత్వం దాని ప్రభావం చాలా అవసరమని గుర్తు చేశారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్ మాట్లాడుతూ.. సమాజ సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు వివేక్ సుబ్రమణియన్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment