పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు | - | Sakshi
Sakshi News home page

పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

Published Fri, Nov 29 2024 6:13 AM | Last Updated on Fri, Nov 29 2024 6:13 AM

పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

పరిశీలించిన బీఆర్‌ఎస్‌ నేతలు

బంజారాహిల్స్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. దీక్షా దివస్‌ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్‌ హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్‌, అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్‌, కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, మాజీ మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఆనంద్‌గౌడ్‌, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రం రావాలి.. తెలంగాణ రాష్ట్రం కావాలని నినదించినట్లు వివరించారు. అటువంటి దీక్షా దివస్‌ను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బైక్‌లపై ర్యాలీగా బసవతారకం హాస్పిటల్‌ సర్కిల్‌ వరకు చేరుకుంటారని, అక్కడి నుంచి పాదయాత్రగా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement