రెవెన్యూ వ్యయం+క్యాపిటల్ వ్యయం= బడ్జెట్: రూ.8,340 కోట
ఆర్టీఏకు వచ్చిన సినీ నటుడు నాగార్జున
● రేపు స్టాండింగ్ కమిటీ ముందుకు..
● అంకెలు భారీగా ఉన్నా.. ప్రభుత్వ నిధులపైనే ఆశలు
● జీహెచ్‌ఎసీకి తప్పని అప్పుల తిప్పలు
● హైసిటీ పనులకు రూ.2,242 కోట్లు
హైసిటీకి అధిక నిధులు
కొత్త బడ్జెట్‌లో హైసిటీ ప్రాజెక్ట్ కింద వివిధ పనులకు అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. గతంలో ఎస్సార్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, సీఆర్‌ఎంపీ పేరిట చేసిన పనులన్నింటినీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైసిటీ పనులుగా మార్చింది. అందులో భాగంగా వివిధ పనులకు కేటాయింపులు ఇలా..
ఇంజినీరింగ్ ప్రాజెక్టులు : రూ.1,207 కోట్లు
రోడ్ల నిర్మాణం: రూ.650 కోట్లు
రోడ్ల నిర్వహణ పనులు: రూ.185 కోట్లు
నాలాలు, వరదనీటి కాలువలు: రూ.200 కోట్లు
● వెరసి హైసిటీ కింద పనులకు రూ. 2,242 కోట్లు కేటాయించారు.
అధిక నిధులు కేటాయించిన ఇతర పనులు
పార్కులు, పచ్చదనం (బయో డైవర్సిటీ): రూ.222 కోట్లు
హెల్త్ అండ్ శానిటేషన్: రూ. 600 కోట్లు
ఘనవ్యర్థాల నిర్వహణ: రూ.703 కోట్లు
రవాణా: రూ.105 కోట్లు
స్ట్రీట్ లైటింగ్: 344 కోట్లు
వాటర్ సప్లయ్, సీవరేజీ లైన్లు: రూ.108 కోట్లు
ఇంజినీరింగ్ (మెయింటెనెన్స్): రూ.254 కోట్లు
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు: రూ.431 కోట్లు
బడ్జెట్ ఇలా (రూ. కోట్లు)
రెవెన్యూ ఆదాయం : 4,205
రెవెన్యూ వ్యయం : 3,936
క్యాపిటల్ ఆదాయం: 4,404
క్యాపిటల్ వ్యయం: 4,404
కొత్త ఆశలతో..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) బడ్జెట్ రూ.7,937 కోట్లు కాగా.. ఆశించిన నిధులు సమకూరకపోయినప్పటికీ, ప్రభుత్వంపై ఆశతో రివైజ్డ్ బడ్జెట్‌ను రూ.రూ.8,150 కోట్లకు పెంచారు. కొత్త సంవత్సరంలో ప్రభుత్వం భారీ నిధులు కేటాయిస్తుందన్న ఆశతో కాబోలు దీన్ని పెంచారు. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో చేసిన మొత్తం ఖర్చు రూ.7,082 కోట్లు.
సాక్షి, సిటీబ్యూరో: రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీహెచ్‌ఎంసీ బడ్జెట్ (ముసాయిదా)ను రూ.8,340 కోట్లతో రూపొందించారు. శనివారం దీన్ని స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం అనంతరం పాలకమండలి సమావేశంలో ఆమోదించి, ప్రభుత్వానికి నివేదిస్తారు. వాస్తవానికి స్టాండింగ్ కమిటీలో చర్చల అనంతరం అవసరమైన మార్పు చేర్పులకు అవకాశమున్నప్పటికీ.. గత కొన్ని సంవత్సరాలుగా ముసాయిదా బడ్జెట్‌నే యథాతథంగా ఆమోదిస్తున్నారు. అదే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.3,065 కోట్లు కేటాయించడంతో అదే ఆశతో కొత్త బడ్జెట్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలతో ఏకంగా రూ.3,800 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వచ్చింది కేవలం రూ.186 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న నాలుగు నెలల్లో మిగతా మొత్తం రావడం కష్టమే. ఏటికేడాది బడ్జెట్ పెరగాలనే సూత్రంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే బడ్జెట్ మొత్తాన్ని కొంత పెంచారు. ఈ ఆర్థిక సంవత్సర (2024–25)బడ్జెట్‌ను రూ.7,937 కోట్లతో ఆమోదించగా.. రాబోయే ఆర్థిక సంవత్సర కొత్త బడ్జెట్‌ను రూ.8,340 కోట్లతో రూపొందించారు. అంటే రూ.403 కోట్లు పెంచారు.
అంకెల్లోనే భారీ..
బడ్జెట్ భారీ స్థాయిలో కనిపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకనుగుణంగా లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌నే తీసుకుంటే రూ.7,937 కోట్లకుగాను ఇప్పటి వరకు సమకూరింది రూ.2643 కోట్లే.
అప్పుల కుప్పే
బడ్జెట్‌లో కేటాయింపుల్లోనూ అప్పులను అధికంగానే చూపారు. ఏకంగా రూ.1,933 కోట్లు అప్పు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అప్పులు, వాటి వడ్డీలకు అధికమొత్తం చెల్లించాల్సి వస్తోంది. వీటితో ఈ భారం మరింత పెరగనుంది.
ఆదుకుంటోంది ఆస్తి పన్నే..
జీహెచ్‌ఎంసీని ప్రతియేటా ఆదుకుంటోంది, సిబ్బందికి జీతభత్యాలిచ్చేందుకు ఉపకరిస్తోంది ప్రజలు చెల్లిస్తున్న ఆస్తి పన్నే. దీనిని దృష్టిలో ఉంచుకొని కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.2,006 కోట్ల ఆస్తిపన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.1,300 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలైంది.
సన్నగిల్లిన టౌన్ ప్లానింగ్ ఆశలు
గతంలో జీహెచ్‌ఎంసీకి టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సైతం రూ.1,872 కోట్ల లక్ష్యాన్ని బడ్జెట్‌లో పేర్కొన్నా, తొలి ఆర్నెల్లలో కేవలం రూ. 425 కోట్లు మాత్రమే సమకూరాయి. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే బడ్జెట్‌లో టౌన్ ప్లానింగ్ ఆదాయ లక్ష్యాన్ని రూ.1,037 కోట్లకు తగ్గించారు.
హౌసింగ్‌కు రూ.300 కోట్లు..
బడ్జెట్‌లో హౌసింగ్ గ్రాంట్స్‌ను ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ఊపుమీదున్నప్పుడు వేలకోట్ల పనులు జరగడంతో దాన్ని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సైతం ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ పద్దు కింద రూ.500 కోట్లు చూపినప్పటికీ, తొలి ఆర్నెల్లలో ఇళ్ల మరమ్మతులకు, దొంగల పాలైన సామగ్రి కొనుగోళ్లకు దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంపై ఆశతో ఈ పద్దు కింద రూ.300 కోట్లుగా చూపారు.
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన కారు టయోటా లెక్సస్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జేటీసీ రమేష్, ప్రాంతీయ రవాణా అధికారి పురుషోత్తంరెడ్డి, తదితరులు వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. కొత్త వాహనాన్ని ‘టీజీ 09 సి 9669’ నంబర్‌పై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున డిజిటల్ సంతకం చేయడంతో పాటు, ఫొటో, చిరునామా తదితర వివరాలను అందజేశారు.
హైకోర్టు తీర్పుతో కదలికలు
● నివాసితులకు నోటీసులు
● ఆందోళనలో బాధితులు
మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్!
‘చలి’ంచని హృదయాలు!
Comments
Please login to add a commentAdd a comment