కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్దంలో వేల సంఖ్యలో సైనికులు, వందల సంఖ్యలో సామాన్య పౌరులు మృత్యువాతపడ్డారు. బాంబు దాడుల నేపథ్యంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై భీకర పోరులో ఒకానొక దశలో రష్యా సైనికులు పట్టుబడి కన్నీరు పెట్టుకున్న ఘటనలు సైతం చూశాం.
ఇదిలా ఉండగా.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో కీలక ప్రకటన చేశారుఉ. తమ కుమారులను ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపకుండా అడ్డుకోవాలని రష్యా సైనికుల తల్లులకు సూచించారు. శనివారం ఓ వీడియో సందేశంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యన్ తల్లులకు ఇదే నా విన‍్నపం అంటూ.. మీ కుమారులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి. మీ పిల్లలను విదేశీ దేశంలో యుద్ధానికి పంపించకండి అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ యుద్దానికి పంపుతుంటే అడ్డుకోవాలన్నారు. ఉక్రెయిన్ ఇలాంటి భయంకర యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ, అవసరమైనంత వరకు ఉక్రెయిన్ సైనికులు తమ దేశాన్ని రక్షించుకుంటారు. ఈ క్రమంలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని.. అందుకే రష్యా తల్లులకు విన‍్నవిస్తున్నానన్నారు. ఇప్పటికైనా రష్యన్ తల్లలు తమ కుమారులు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని యుద్దంలో ఉండకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
అంతకు ముందు ఉక్రెయిన్ మొదటి మహిళ వ్లాదిమిర్ జెలన్ స్కా.. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టింది సైనిక చర్య కాదని, పూర్తిస్థాయి యుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచదేశాలకు తెలియజేయాలని ఇతర దేశాల ప్రథమ మహిళలను కోరారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్టును రిలీజ్ చేశారు. మీ బిడ్డలు ఉక్రెయిన్‌తో యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో మరణిస్తున్నారని రష్యన్ తల్లులకు వినిపించేలా చెప్పండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment