No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Sep 28 2024 1:24 AM | Last Updated on Sat, Sep 28 2024 1:24 AM

No He

సాక్షి ప్రతినిధి కరీంనగర్‌ :

కోరుట్లలో పోలీసులు అకారణంగా కొట్టార న్న మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు వదిలి న ఘటన వారి ప్రవర్తనను మరోసారి బయట పెట్టింది. ఆలుమగల పంచాయితీ, చిన్నదొంగతనాలు, అప్పులు, సివిల్‌ తగాదాల్లో వచ్చే ఫిర్యాదులపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే.. వీలైనంత వరకు రాజీచేయాలి. తీవ్ర నేరారోపణలైతేనే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాలి. కానీ.. కొంతకాలంగా అయినదానికి, కానిదానికీ చేయిచేసుకోవడం, అసభ్య పదజా లంతో దూషించడం.. అక్రమంగా అరెస్టులు చేయడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. పౌ రుల హక్కులను కొందరు ఖాకీలు కాలరాస్తున్నారన్న అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో పోలీసుశాఖకు అప్రతిష్ట తీసుకుకొచ్చిన నేరెళ్ల, పెగడపల్లి ఘటనలు పునరావృతమవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎస్సైల అత్యుత్సాహం..

భార్యాభర్తలమధ్య తగాదాలో కోరుట్ల–2 ఎస్సై శ్వేత అత్యుత్సాహం ప్రదర్శించారు. బాధితుడు శివప్రసాద్‌ను ఠాణాకు పిలిపించి సర్దిచెప్పాల్సింది పోయి.. భార్య ఎదుటే విచక్షణ రహితంగా కొట్టి, అసభ్య పదజాలంతో దూషించడంతోనే తమవాడు ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డిపార్ట్‌మెంటు మాత్రం బాధితుడిని కొట్టనే లేదని ఎస్సైని వెనకేసుకొస్తోంది. ఎస్సై తీరుతోనే శివ ప్రసాద్‌ ఆత్మహత్యకు యత్నించాడని తెలిసి.. ఆయన పోయేవరకు కాలయాపన చేశారే తప్ప, మరణవాంగ్మూలం తీసుకోవడంలో ఆసక్తి చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020 అక్టోబరులోనూ ఇదే తరహాలో ఓ మహిళా ఎస్సై పేకాట ఆడుతున్న వారిని పట్టుకుని చితకబాదడంతో సాయికిరణ్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లాలో మరో మహిళా ఎస్సై అదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

జగిత్యాల– కరీంనగర్‌ జిల్లాల్లో..

● జగిత్యాల జిల్లా కోరుట్లలో మూడురోజుల క్రితం కౌన్సెలింగ్‌ ఇచ్చి సరిపెట్టాల్సిన వ్యవహారంలో ఓ ఎస్సై దురుసు ప్రవర్తన ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది.

● ఇదే జిల్లాలో ఐదురోజుల క్రితం ఓ ఎస్సై ఏకంగా ఓ మహిళా కానిస్టేబుల్‌ ఇంటికి రాత్రిపూట వెళ్లి ఆమె భర్త కంటపడి దెబ్బలు తిన్నాడు.

● నెల రోజుల క్రితం మెట్‌పల్లి సబ్‌ డివిజన్‌లోని ఓ ఠాణాలో ఏఎస్సై, మరో కానిస్టేబుల్‌ మహిళను కొట్టి వివాదానికి కారణమయ్యారు.

● రెండు నెలల క్రితం జిల్లాలోని ఓ పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో ఓ సీఐ గన్‌మెన్‌ తాను పనిచేస్తున్న పట్టణంలోనే ఓ మహిళతో సంబంధాలు నెరుపుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి.

● కరీంనగర్‌ జిల్లా రామడుగు పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెలిచాల గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని అరెస్టు పేరుతో పలుమార్లు స్టేషన్‌లో ఎస్సై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడని బాధితుడు కనకయ్య ఆరోపించాడు. సీపీ, కలెక్టర్‌తోపాటు పలు దళిత సంఘాలకు ఫిర్యాదు చేశాడు. మానవహక్కుల కమిషన్‌, రాష్ట్ర, జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాడు. గొర్రెలు దొంగతనం చేశారన్న కేసులో తెల్లవారుజామున అరెస్టు చేయడం, కమిషనరేట్‌లో నిర్బంధించి చితకబాదడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

● ఇటీవల ఓ అరెస్టు విషయంలో సైదాపూర్‌ ఎస్సై కూడా నిందితుడి ఇంటికి వెళ్లి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సివిల్‌ వివాదంలో సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డిని స్టేషన్‌కి రావాలంటూ ఒత్తిడి తేవడంతో బాధితుడికి ఛాతినొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్సై ఇంటికి వెళ్లి.. అతన్ని స్టేషన్‌కి రావాలంటూ.. పట్టుబట్టడం, అతను బాత్‌రూంకి వెళ్లినా వెంట వెళ్లడం వంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి.

● డిసిప్లీనరీ ఫోర్స్‌కు మారుపేరు పోలీస్‌ శాఖ.. విధి నిర్వహణలో క్రమశిక్షణతో నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన సిబ్బందిలో కొందరు దారితప్పు తూ పోలీస్‌శాఖకు మచ్చతేవడం కలకలం రేపుతోంది. తప్పుచేసిన వారిపై నిక్కచ్చిగా చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లిప్తంగా ఉండటం గమనార్హం.

మండిపడుతున్న దళిత, గిరిజన సంఘాలు

ఇటీవల రామడుగు ఠాణాలో గిరిజనుడినిపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, కోరుట్లలో దళితుడిపై చేయిచేసుకుంటే అతను పెట్రోలు పోసుకుని ప్రాణాలు తీసుకోవడంపై దళిత, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. బలహీనులపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తుండం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్‌ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని, బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రాయికల్‌ ఎస్సై అశోక్‌ సస్పెన్షన్‌

కోరుట్ల ఎస్సై–2 శ్వేత వీఆర్‌కు

జగిత్యాల జిల్లా రాయికల్‌ ఎస్సై అశోక్‌ను సస్పెండ్‌ చేస్తూ మల్టీజోన్‌–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. కోరుట్ల ఎస్సై–2 శ్వేతను వీఆర్‌కు అటాచ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. రాయికల్‌ ఎస్సై అశోక్‌ ఓ మహిళా కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి గొడవకు పా ల్పడటంతో జిల్లా పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్‌ చేసినట్లు ఎస్పీ వివరించారు. కోరుట్ల ఎస్సై–2 శ్వేత ఈనెల 22న భార్యాభర్తల గొడవ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారు. భర్తకు కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సింది పోయి ఎస్సై చేయిచేసుకున్నారు. మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎస్సై శ్వేతను వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఆదేశాలిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/2

No Headline

No Headline2
2/2

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement