తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల/మల్యాల: సమగ్ర కుటుంబ సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిలుకవాడ, పోచమ్మవాడ, అరవింద్‌నగర్ తదితర కాలనీలతో పాటు మల్యాల, ముత్యంపేట గ్రామాల్లో స్టిక్కరింగ్ వేసిన ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో, పట్ట ణాల్లో వచ్చిన అధికారులకు ప్రజలు తప్పనిసరిగా వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నెల 6 నుండి సర్వే ప్రారంభం కానుందని, మూడు రోజుల్లో స్టిక్కరింగ్ పూర్తిచేయాలని అన్నారు. స్టిక్కరింగ్ వేసే టప్పుడు సర్వేపై అవగాహన కల్పించాలని, ధరణి పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్‌పాసుపుస్తకాలు అందరూ అందుబాటులో ఉంచుకోవా లని తెలియజేయాలన్నారు. అధికారులు సమన్వయంతో సమగ్ర కుటుంబ సర్వేను ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని ఆదేశించారు. సర్వే అయిన ప్రతీ ఇంటి గోడపై స్టిక్కర్ అంటించాలన్నారు. ఎన్యుమరేటర్‌కు కేటాయించిన బ్లాక్‌లలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన షెడ్యూల్ పార్ట్–1, 2లలో 75 ప్రశ్నలతో కూడిన కుటుంబ వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతీ ఇంటివారితో గౌరవంగా, హుందాగా వ్యవహరించి స్పష్టత కలిగిన నిజాయితీతో కూడిన సమాధానాలు సేకరించాలన్నారు. ఈ సర్వే ప్రధాన ఉద్దేశంపై అవగాహన క ల్పించాలన్నారు. సమాచారం గోప్యంగా ఉంచబడుతుందన్నారు. నింపిన షెడ్యూల్ ఫారం జాగ్రత్తగా భద్రపర్చాలని, ఈ డేటా ఇతరులతో పంచుకోకూడదన్నారు. ఆర్డీవో మధుసూదన్, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్, కమిషనర్ చిరంజీవి, మెప్మా ఏవో శ్రీనివాస్, మల్యాల ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ మునీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment