హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వంపై పోరాడుతా
మల్లాపూర్: రైతులకిచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతానని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండంలోని రేగుంటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం అందిందని, ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో నిలిచిందని గుర్తు చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సాధ్యంకాని హామీలు ఇచ్చి ఇప్పుడు అన్నివర్గాలను నిండా ముంచుతోందన్నారు. రైతు పాదయాత్రతో ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు. కేంద్రాల నిర్వాహకులు రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయన వెంట ప్యాక్స్ చైర్మన్ వేంపేట నర్సారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేశ్, మాజీ సర్పంచులు నిమ్మల భూమారెడ్డి, రంగు రామాగౌడ్, నాయకులు సురకంటి తిరుపతిరెడ్డి, కాలసాని రాజన్న, సార్ల జితేందర్‌రెడ్డి, ప్యాక్స్ సీఈవో పాదం భూమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
రైతు పాదయాత్రతో ప్రభుత్వం దిగిరాక తప్పదు
కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి
కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment