రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం రాజేందర్ తెలిపారు. ఈనెల 5న కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన జోనల్ లెవల్ అండర్–14 పోటీల్లో 8వ తరగతి చదువుతున్న ఎన్.సాయికుమార్, ఎం.గాయత్రి, ఆర్.నేహ ప్రతిభ కనబరిచారు. వీరు ఈనెల 8 నుంచి పదో తేదీ వరకు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు జ్ఞాపికలు అందించి అభినందించారు.
ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి
పెగడపల్లి: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత నిర్వాహకులకు సూచించారు. మండలంలోని నంచర్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో దీకొండలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీవో మనోజ్‌కుమార్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. రాములపల్లి, నంచర్ల, రాంనగర్‌లోని కేంద్రాలను సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు. విండో చైర్మన్ వేణుగోపాల్, తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సురేందర్‌రావు, ఏపీఎం సమత, రైతులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ సిబ్బంది పొలం బాట
జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం పొలంబాట చేపట్టారు. ఏడీ జవహర్ నాయక్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా సిబ్బంది దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు వివరించారు. సింగిల్ విండో అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఏఈ శ్రీధర్, లైన్‌మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
మెట్‌పల్లిరూరల్: విత్తనాలు, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి రామచందర్ అన్నా రు. మెట్‌పల్లి పట్టణంతోపాటు పలు గ్రామాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం తని ఖీ చేశారు. రిజిస్టర్లు, బిల్‌బుక్‌లు, స్టాక్ రిజి స్టర్లు పరిశీలించారు. ఫర్టిలైజర్ దుకాణ యజ మానులకు పలు సలహలు, సూచనలు చేశా రు. ఫర్టిలైజర్ దుకాణాలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు ఉంటాయన్నారు. అనంతరం జగ్గాసాగర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యంలో తాలు, తప్ప లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఏవో దీపిక, ఏఈవో భూమేశ్వర్ పాల్గొన్నారు.
ఐక్యంగా పోరాడే సమయం ఆసన్నమైంది
కోరుట్ల: సమాజంలో అన్యాయాలను ఎదురించేందుకు ఐక్య పోరాటాలు చేయాల్సిన సమ యం ఆసన్నమైందని జాతీ య మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదనూరి జ్యోతి అన్నారు. పట్టణంలోని సీ.ప్రభాకర్ భవన్‌లో సమాఖ్య జిల్లాస్థాయి సమావేశం నిర్వహించా రు. దోపిడీ పాలకుల రాజ్యాధికారాన్ని కూలదోసి సమసమాజాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రావాలన్నారు. అమెరికాలో కమలా హారీస్ ఓటమికి పురుష అహంకార, ఆధిపత్య ధోరణి కారణమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుల శాంత, గంగామణి, సాంబార్ సంతోషి, శిరీష, లక్ష్మీ, స్వప్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment