కొనుగోలు కేంద్రాల ప్రారంభం
గొల్లపల్లి/ధర్మపురి/వెల్గటూర్: నియోజకవర్గంలో ని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గురువారం ప్రారంభించారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మాధవరావు, వైస్ చైర్మన్ రేల్ల సత్తయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ధర్మపురిలోని వ్యవసాయ మార్కెట్‌లో డీసీ ఎంస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని విప్ ప్రారంభించారు. డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుములు లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం
ఎన్నికల్లో భాగంగా చెగ్యాంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అడ్లూరి అన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు 126 కుటుంబాలకు రూ.18 కోట్ల పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుండాటి గోపిక, వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో కోటిలింగాల వద్ద గోదావరిలో చేపపిల్లలను వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment