చరణ్ వైద్యానికి చేయూత
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లికి చెంది న సిరిపురం చరణ్ వైద్యానికి దాతలు రూ.2.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చరణ్ దుస్థితిని ఈనెల 5న ‘పుత్ర భిక్ష పెట్టండి’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. అడ్డగట్ల హరికృష్ణ రూ.50 వేలు, గణిత టీచర్స్ ఫోరం రూ.21 వే లు, భూపతిపూర్ ఉపాధ్యాయ బృందం రూ. 18 వేలు, రాయికల్ మండల ఉపాధ్యాయులు రూ.15,500, కోరుట్లకు చెందిన కట్కం లక్ష్మి రూ.15 వేలు, జగిత్యాల సోషల్ టీచర్స్ ఫోరం రూ.11 వేలు, బి.శ్రీనివాస్ రావు(యూఎస్‌ఏ), ఉపాధ్యాయుడు నరహరి, గాజంగి రాజేశం, కట్కం రాంప్రసాద్, కుమ్మరిపల్లి నేతాజీ యూత్, రాయికల్ ఫ్రెండ్స్‌యూత్ , కుమ్మరిపల్లి బుల్స్ యూత్, వివేకానంద యూత్, కట్కం భూమేశ్వర్, కై రం సత్యంగౌడ్, ఎంఈవో రాఘవులుతోపాటు మరికొంత మంది సభ్యులు, యువజన సంఘ సభ్యులు ఆర్థిక సహాయం అందించారు. చరణ్ కుటుంబం సాక్షికి కృతజ్ఞతలు తెలిపింది.
చదువుల తల్లి అక్షయకు ఆర్థిక సహాయం
మేడిపల్లి: మండలంలోని కాచారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని న్యాత అక్షయ చదువుకు దాతలు ముందుకొస్తున్నారు. వికారాబాద్‌లో నర్సింగ్ సీటు వచ్చినా ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతున్న అక్షయ దీనస్థితిని ఈనెల 4న శ్రీచదువుకోవాలని ఉంది.. సహాయం చేయండిశ్రీ శీర్షికన కథనం ప్రచురించింది. గురువారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, సింగిరెడ్డి దోసిలి వ్యవస్థాపక అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి స్పందించారు. రూ.20వేలు సాయం అందించారు. అక్షయ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టి తీసుకెళ్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మాజీ సర్పంచ్ చిట్యాల సురేశ్, దేశెట్టి గంగాధర్ రెడ్డి, అనుదీప్, సయ్యద్, లాజర్, వరుణ్ ఉన్నారు.
రూ.2.80 లక్షల ఆర్థిక సహాయం
సింగిరెడ్డి దోసిలి ఆధ్వర్యంలో రూ.20వేల సాయం
Comments
Please login to add a commentAdd a comment