ప్రశాంతంగా ముగిసిన గ్రూప్–3 పరీక్షలు
జగిత్యాల: గ్రూప్–3 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం నిర్వహించిన పరీక్షకు 10,656 మందికి 5,501 మంది మాత్రమే హాజరయ్యారు. 34పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బంది కలకుండా ఏర్పాట్లు చేశారు. జవాబుపత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జేఎన్‌టీయూకు తరలించారు.
పరీక్షాకేంద్రాలు పరిశీలించిన కలెక్టర్
కోరుట్ల/కోరుట్ల రూరల్: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అరుణోదయ డిగ్రీ కళాశాల్లోని పరీక్షాకేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, మెట్‌పల్లి సీఐ నీరంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. జిల్లాకేంద్రంలో పరీక్ష సరళిని పరిశీలించారు. అన్ని రూట్లలో సీఐ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా, ఎస్సై స్థాయి అధికారి ద్వారా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించామన్నారు.
భర్త సహాయంతో..
కోరుట్ల: ఓ నిండు గర్భిణి భర్త సహాయంతో వచ్చి పట్టణంలోని డిగ్రీ కళాశాల కేంద్రంలో పరీక్ష రాసింది. జగిత్యాలకు చెందిన రీనా కథలాపూర్ మండలం అంబారిపేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. గ్రూప్–3 పరీక్షలకు ప్రిపేర్ అయిన ఆమె.. భర్త రామకృష్ణ సహాయంతో కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది.
జేఎన్‌టీయూ(హెచ్)కు జవాబుపత్రాలు తరలింపు
రెండోరోజు 51.61 శాతం మాత్రమే హాజరు
Comments
Please login to add a commentAdd a comment