వేతనాల కోసం ఆందోళన
జగిత్యాల: వంట కార్మికులకు వేతనాలు పెంచాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. కార్మికులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంటలు చేయడానికి ఎవరూ ముందకు రాని సమయంలో ధైర్యం చేసి 22ఏళ్లుగా పిల్లలకు వండిపెడుతున్నారని తెలిపారు. అధికారంలోకొస్తే రూ.10వేల వేతనం చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయని, ప్రభుత్వం ఇచ్చే రూ.5 సరిపోవడం లేదని పేర్కొన్నారు. వంట సరుకులను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. అనంతరం డీఈవోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముఖ్రం, హన్మంతు, రాజమౌళి, పద్మ, భాగ్యలక్ష్మీ, గంగాధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment