మహిళాసంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళాసంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

Published Tue, Nov 19 2024 12:33 AM | Last Updated on Tue, Nov 19 2024 12:33 AM

మహిళాసంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మహిళాసంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

● జిల్లా సమైక్య భవనానికి రూ.5 కోట్లు మంజూరు ● డీపీఎం వెంకటేశ్‌ వెల్లడి

జగిత్యాలరూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మహిళాసంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, జిల్లా సమైక్య భవనానికి రూ.5 కోట్లు మంజూరు చేసిందని డీపీఎం వెంకటేశ్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌, అర్బన్‌ మండలాల సమైక్య సభ్యులతో కలిసి మహిళాశక్తి వారోత్సవాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళాసంఘాలకు ప్రభుత్వం బ్యాంక్‌ లింకేజీ రుణం, బీమా, ప్రమాదబీమా, వడ్డీలేని రుణాలు, అమ్మఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫాంల తయారీ, చిన్నతరహా పరిశ్రమలు, కొత్త సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు. అనంతరం నిధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్‌, సీసీలు విద్యాసాగర్‌, మరియ, శ్రీనివాస్‌, రవీందర్‌, రూరల్‌ మండల అధ్యక్షురాలు మారు సత్తవ్వ, అర్బన్‌ మండల అధ్యక్షురాలు గంగభవాని, కార్యదర్శులు శ్రీలత, జమున పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement