ప్రజావాణికి 41 ఫిర్యాదులు
జగిత్యాల: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు
తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన 41మంది నుంచి అర్జీలు స్వీకరించారు. దూర ప్రాంతాల వారు వివిధ సమస్యలతో ప్రజావాణికి వస్తారని, వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్.లత, గౌతమ్‌రెడ్డి, ఏవో హన్మంతరావు, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు.
●
Comments
Please login to add a commentAdd a comment