సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలి
జగిత్యాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, భూసేకరణలో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్యాకేజీ పరిధిలోని 9, 10, 11, 12 పనుల పూర్తికి నిధులు మంజూరు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో డాటా ఎంట్రీ వేగం పెంచాలన్నారు. సన్నాలు విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ పడేలా చూడాలన్నారు. ఇకనుంచి సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు, చౌకధరల దుకాణాలకు సన్నరకం బియ్యం అందిస్తామని వెల్లడించారు. కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment