రైతులకు ఇబ్బందులు రానీయొద్దు
ధర్మపురి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధాన్యంలోని తేమ శాతం, తాలు, తప్పను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారని తహసీల్దార్ కృష్ణచైతన్యను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో వేగం పెంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరుణ్, ఎంపీడీవో రవీందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment