సనాతన ధర్మం పరిరక్షణే ధ్యేయం
రాయికల్ : సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి హిందువు పనిచేయాలని జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ వేముల రాంరెడ్డి, గోసేవ ప్రముఖ్ భీరెల్లి సంతోష్ అన్నారు. పట్టణంతోపాటు మండలంలోని రామాజీపేటలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖల ఆధ్వర్యంలో వార్షికోత్సవం, సంక్రాంతి ఉత్సవం, వివేకానంద జయంతి నిర్వహించారు. ప్రధాన వ్యక్తలుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ, వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తుందన్నారు. వేద, పురాణ, ఇతిహాసాల్లో, సనా తన ధర్మ సంస్కృతిలో ఎక్కడా కుల ప్రస్తావన, వివక్ష లేదని, వీటన్నింటిలో ఆచరణాత్మకమైన సామాజిక సమరసత ఇమిడి ఉందని పేర్కొన్నారు. హిందువులందరూ కులాలు, రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా వుండి సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, కుర్మ మల్లారెడ్డి, తోపారపు రవీందర్, కుర్ర శ్రీనివాస్, చెంగలి మహేష్, గన్నవరం గంగాధర్, రాజేశం, సామల్ల సతీష్, వీరబత్తిని శంకర్, పటేల్ రాము, కంటె భూమేష్, ఇద్దం గంగారెడ్డి, సూర సాయి, స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment