‘అలిశెట్టి’కి ఘన నివాళి
జగిత్యాలటౌన్: అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ రచనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్ అడువాల జ్యోతి అన్నారు. అలిశెట్టి జయంతి, వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అంగడిబజారులోగల ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు, పట్టణ ప్రజలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తన కవితలతో సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపారని కొనియాడారు. కవిగా, చిత్రకారుడిగా, ఫొటోగ్రాఫర్‌గా రాణించారని పేర్కొన్నారు. తన అక్షరాలను ఆయుధాలుగా మలిచి గొప్ప విప్లవాన్ని సృష్టించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. ప్రజల జీవన విధానంలోని పదాలను కలబోసి కవిత్వంగా మరిచిన గొప్పకవి అని కొనియాడారు. అలిశెట్టి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ నివాళి అర్పించారు. భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో ఏసీఎస్.రాజు నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment