జగిత్యాల ఎమ్మెల్యే షాడో కాంట్రాక్టర్
● పైసల కోసమే పార్టీ మారిండు ● సంజయ్‌పై స్పీకర్ చర్యలు తీసుకోవాలి ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత
జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే షాడో కాంట్రాక్టర్ అని, అతనిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. డబ్బుల కోసం పార్టీ మారింది ఒక సంజయ్ అన్నారు. మూడుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి, రెండుసార్లు గెలిపించిందన్నారు. తనది కాంగ్రెస్ కుటుంబమని అంటున్న సంజయ్‌కు ఆ పార్టీ కనీసం అవకాశం ఇవ్వలేదు కదా అని గుర్తు చేశారు. కౌశిక్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే మూడు కేసులు పెట్టారని, రాష్ట్రంలో రౌడీపాలన సాగుతోందని పేర్కొన్నారు. సంజయ్ రాజీనామా చేసి.. కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని గెలవాలని జగిత్యాల ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. జగిత్యాల అభివృద్ధి కేటీఆర్, కవితతోనే జరిగిందని, బోర్నపల్లి బ్రిడ్జి, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మెడికల్ కళాశాల వారి చొరవతోనే వచ్చాయని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. కవిత జైలులో ఉన్నప్పుడు ద్రోహం చేసి పార్టీ మారిన ఘనత సంజయ్‌దని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ శీలం ప్రియాంక, ఉదయశ్రీ, ఆనందరావు, మల్లేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment