No Headline
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో ఎడ్లబండిపై యువతుల సందడి
న్యూస్‌రీల్
సంబురాల సంక్రాంతి
పంట దిగుబడులతో రైతుల కళ్లల్లో కనిపించే కొత్త కాంతికి ప్రతీక సంక్రాంతి. ముంగిళ్లలో ముచ్చటైన ముగ్గులు.. గొబ్బెమ్మలు.. డూడూ బసవన్నలు.. హరిదాసుల కీర్తనలు.. భోగిమంటలు.. పిండివంటలు.. నింగిలో పతంగులు.. సంబురాల సంక్రాంతిని జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోమవారం భోగితో ప్రారంభమైన సందడి మంగళవారం సంక్రాంతికి మరింత పెరగనుంది. పండుగొస్తే చాలు అమ్మలాంటి ఊరి ముంగిట్లో వాలిపోవాలనిపిస్తుంది. అందుకే, వివిధ ప్రాంతాల నుంచే కాకుండా, విదేశాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు చేరుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. మహిళలు ముగ్గులు, పిండి వంటల్లో బిజీగా ఉంటే.. యువత, పెద్దలు ఇరుగుపొరుగు వారి పలకరింపులతో హడావుడి నెలకొంది.
– కరీంనగర్ కల్చరల్/సిరిసిల్ల కల్చరల్/సుల్తానాబాద్
Comments
Please login to add a commentAdd a comment