పంటలు చేతికొస్తే పండుగే..
సంక్రాంతి వచ్చే నాటికి పంటలు చేతికొస్తే రైతులకు పండుగే. ధాన్యం విక్రయించగా వచ్చే డబ్బులను చూసి తెగ సంబరపడిపోతుంటారు. గత సీజన్ సాగులో కష్టనష్టాలను గుర్తు చేసుకుంటూ మరో సీజన్‌కు ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. అయితే, రైతులకు ఆనందం తెచ్చే సంక్రాంతి ఆధునిక టెక్నాలజీ నేపథ్యంలో గ్రామాల్లో మాయమవుతోంది. ట్రాక్టర్లు వంటి ఆధునిక పరికరాలు వ్యవసాయంలోకి చొచ్చుకురావడంతో అన్నదాతలకు చేదోడువాదోడుగా ఉండే కాడెద్దులు, పాడి ఆవులు దూరమవుతున్నాయి. ఎన్ని మార్పులు వచ్చినా ఇప్పటికీ గ్రామాలు వరి, మొక్కజొన్న, పసుపు వంటి పంటలతో కళకళలాడుతున్నాయి. అయితే, రైతుల్లో వెనకటి ప్రేమలు కరువవుతున్నాయి. ఏదేమైనా సంక్రాంతి రైతు పండుగ. – జగిత్యాల అగ్రికల్చర్
Comments
Please login to add a commentAdd a comment