ఘనంగా గోదారంగనాథుల కల్యాణం
మెట్‌పల్లిరూరల్: పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన గోదారంగనాథుల కల్యాణానికి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్, సరోజన దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మహజన్ నర్సింహులు పాల్గొన్నారు. అలాగే మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ శ్రీవేణుగోపాలస్వామి కల్యాణ మండపంలో నిర్వహించిన గోదారంగనాథుల కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌రెడ్డి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment