దేవస్థాన కమిటీ లేకుండానే బ్రహ్మోత్సవాలు
● ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
లింగాలఘణపురం: జిల్లాలోనే ఎంతో ప్రాశస్త్యం కలిగిన జీడికల్ వీరాచల రామచంద్రస్వామి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జాతర ప్రారంభోత్సవానికి దేవస్థాన కమిటీని ప్రకటిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన నాయకులకు నిరాశ ఎదురైంది. బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే కడియం నివాసంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కనీసం గతంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఏలె మూర్తితో పాటు మరో 13 మంది డైరెక్టర్లను నియమించి ఉత్సవాలను నిర్వహించారు. అదే కమిటీ పూర్తిస్థాయిలో బ్రహ్మోత్సవాలకు కూడా ఏర్పాటు అవుతుందనే ఆశతో నాయకులు ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలుగా మిగిలాయి. ఎమ్మెల్యే నివాసంలో ఈఓ వంశీ, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిలీప్‌రెడ్డి, నరేశ్, శ్రీధర్‌రెడ్డి, ఉపేందర్, సంపత్, గంగాధర్, తదితరులు బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ విషయంపై ఈఓ వంశీని వివరణ కోరగా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయి కమిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment