బంగారు భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలి
● డీఈఓ కె.రాము
దేవరుప్పుల: ప్రాథమిక, ఉన్నత విద్యాబోధన స్థాయిలోనే విద్యార్థులు ఉజ్వళ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని జిల్లా విద్యాధికారి కె.రాము అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలయేసు హైస్కూల్‌లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర స్ఫూర్తితో విద్యార్థుల్లో సృజనాత్మక విద్యను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రయోగాత్మక విద్యను అలవర్చుకున్న విద్యార్థులు భవిష్యత్‌లో ఆశించిన రంగాల్లో రాణిస్తారన్నారు. లక్ష్యసాధనకు అంకితభావంతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేస్తూ సమాజ అభివృద్ధికి అడుగులు వేసేలా తయారు కావాలన్నారు. అంతకుముందు లీడర్ల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment