యంత్రాలు ఇచ్చారు.. టెక్నీషియన్లను మరిచారు
జనగామ: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 134 రకాల ఉచిత వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో పూర్తి స్థాయి సేవలు లేనప్పటికీ, ఖరీదైన పరీక్షలు చేస్తున్నారు. మండలాల వారీగా జిల్లా ఆస్పత్రి, ఎంసీహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల నుంచి రోజువారీగా వైద్యుల సలహాలు, సూచనల మేరకు రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్‌కు పంపిస్తారు. ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత నేరుగా రోగుల మొబైల్ నంబర్‌కు జనరల్ మెసేజ్ వెళుతుంది. దీని ఆధారంగా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేసుకుంటారు. ఇప్పుడున్న సేవలను పెంచాలనే లక్ష్యంగా పలు రకాల పరీక్షలకు సంబంధించి రూ.లక్షలు ఖరీదు చేసే యంత్రాలను ప్రభుత్వం మంజూరీ చేసింది. కానీ యంత్రాల ద్వారా పరీక్షలు చేసే టెక్నీషియన్లు, కెమికల్స్ ఇవ్వడం మరిచింది. ఫ్లోరోసిన్ మైక్రోస్కోప్ యంత్రం ధర సుమారు రూ.14లక్షల వరకు ఉంటుంది. మోకాళ్ల నొప్పులను గుర్తించేందుకు వ్యక్తి శరరీంలో రక్తం శాంపిళ్లను సేకరించి దీనిపై పరీక్షిస్తారు. ప్రైవేట్‌లో ఈ పరీక్షలకు సుమారుగా రూ.15వందల వరకు ఖర్చు అవుతుంది. ఈ యంత్రంపై రక్త పరీక్షలు చేసేందుకు మైక్రో బయాలజిస్టు టెక్నీషియన్ ఉండాలి.
పైఫొటో కనబడుతున్న యంత్రం కో ఆగ్లో మీటర్. రక్తం గడ్డ కట్టడానికి 18 ఫ్యాక్టర్లు అవసరం. ఏ ఫ్యాక్టర్‌లో లోపం ఉందని తెలుసుకునేందుకు ఈ యంత్రంపై పరీక్షిస్తారు. రూ.18 ల క్షల విలువ చేసే ఈ పరికరాన్ని రెండేళ్ల క్రితం డయాగ్నోస్టిక్‌కు పంపించారు. ఈ పరీక్షలు ప్రైవేట్‌లో చేయించుకోవాలంటే సుమారు రూ.12 వందల వరకు ఖర్చు అవుతుంది. పాథాలజిస్టు, శిక్షణ పొందిన ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి.
మూలనపడిన విలువైన పరికరాలు
ఉత్సవ విగ్రహంలా టీజీ డయాగ్నోస్టిక్
Comments
Please login to add a commentAdd a comment