టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
జనగామ రూరల్: ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయోస్తు కార్యక్రమంలో భాగంగా స్టడీ అవర్స్‌లో అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో విద్యార్థులచే సాధన చేయించాలన్నారు. వసతి గృహాల్లోని వార్డెన్‌లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న అన్ని ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి విద్యార్థులకు మాక్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. అలాగే ప్రజ్ఞోత్సవ కార్యక్రమంలో భాగంగా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మండల స్థాయిలో నృత్య మేళా, వ్యాస రచన, తదితర కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్, జీసీడీఓ గౌసియా బేగం, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ
లబ్ధిదారుల ఎంపిక నిరంతరం ప్రక్రియ అని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం మండలంలోని శామీర్‌పేటలో ప్రజాపాలన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేయనున్న నేపథ్యంలో ప్రజాపాలన గ్రామసభలను ఏర్పాటు చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీడీఓ సంపత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
అపోహలు నమ్మొద్దు
ప్రజలు అపోహలు నమ్మొద్దని, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారిలతో కలిసి గ్రామసభల నిర్వహణపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రదర్శించిన పథకాల అర్హుల జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా స్వీకరించి విచారణ చేపట్టాలని, అనర్హులుగా తేలితే జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అర్హులు ఎవరైనా ఉంటే మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలన్నారు. పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే అనంతరం ఇళ్లు లేని దాదాపు 30 లక్షలమంది అర్హులను గుర్తించి వివరాలు జిల్లాలకు పంపామని, వీరిలో ఇంటి స్థలం ఉన్నవారిలో ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలను మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్‌కుమార్, జిల్లా అధికారుల పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment