అర్హులకు సంక్షేమ పథకాలు
రఘునాథపల్లి/చిల్పూరు: ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీఒక్కరికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి, చిల్పూరు మండలంలోని వంగాలపల్లిలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కానున్నాయన్నారు. అర్హులను క్షేత్రస్థాయి పరిశీలన జరిపి లబ్ధిదారుల ముసాయిదా జాబితా రూపొందించామన్నారు. పేర్లు లేని వారు ఆందోళనకు గురికావొద్దని, గ్రామసభలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, జిల్లా పంచాయతీ అధికారి సరిత, మండల ప్రత్యేకాధికారి మాధవీలత, తహసీల్ధార్ సరస్వతి, జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్, క్లస్టర్ అధికారి రఘునందన్‌రెడ్డి, ఏఈఓ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి
వినయ్‌కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment