హెల్ప్‌డెస్క్‌ల్లో కొత్త దరఖాస్తుల స్వీకరణ
జనగామ: జిల్లాలో కొనసాగుతున్న గ్రామసభల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి కొత్తగా దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బా షా ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి ఆర్డీఓలు, ఎస్డీసీలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అన్ని మండల, వార్డు స్థాయి క్లస్టర్ అధికారులతో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ, వార్డుసభల నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. గ్రామసభల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి కొత్త దరఖాస్తులు, అభ్యంతరాలను స్వీకరించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీ ఈఓ మాధురీషా, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హ నుమాన్‌నాయక్, డిప్యూటీ సీఈఓ సరిత, ము న్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment