No Headline
సాధారణ బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లా నిధులు వాటా ఇలా ఉంటే.. పింక్ బుక్ విడుదలైతేనే రైల్వేశాఖకు కేటాయింపులు తేలనున్నాయి. మణుగూరు–రామగుండం రైల్వేలైను సర్వే కోసం బడ్జెట్ కేటాయించిన కేంద్రంలో భూసేకరణ, నిర్మాణం కోసం నిధులు ఇచ్చారా? లేదా?.. మంజూరైన హసన్‌పర్తి – కరీంనగర్, డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వేలైన్‌ల సర్వే, భూసేకరణ, నిర్మా ణం కోసం చేసిన కేటాయింపులు ఎంత? అన్న లెక్కలు తేలనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఏ మేరకు నిధులిచ్చారు? కాజీపేట రైల్వే టౌన్ స్టేషన్, రైల్వే ఆసుపత్రిని సఖ్ డివిజన్ ఆసుపత్రి మార్పుపైన ఇంకా ఆశలు ఉన్నాయి. స్టేషన్ ఘన్‌ఫూర్ నుంచి సూర్యాపేట వరకు కొత్త లైన్, కాజీపేట జంక్షన్ నుంచి ముంబయి, విజయవాడ, కాగజ్‌నగర్ వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభంతోపాటు ఉమ్మడి వరంగల్‌లో పలు అంశాలకు పింక్‌బుక్‌లో ఊరట లభిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment