పెరుగులో ఫంగస్.. నెయ్యిలో ఈగలు
రఘునాథపల్లి: ఫంగస్ చేరిన పెరుగు.. నెయ్యిలో ఈగలు, దోమలు.. ఆహార పదార్థాల సమీ పంలో అపరిశుభ్రత.. ఇదీ గోవర్ధనగిరి శివారు శక్తి మిల్క్ అండ్, మిల్క్ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రంలో పరిస్థితి. శనివారం ఆ కేంద్రాన్ని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేప్టీ టాస్క్‌ఫోర్స్ అధికా రులు తనిఖీ చేశారు. ఫంగస్ చేరిన 720 కిలోల పెరుగును పారబోసి, లేబుల్ లేకుండా నిల్వ చేసిన 1,700 కిలోల పెరుగును స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ స్టోరేజ్ రూమ్ శ్లాబ్ పెచ్చులు ఊడుతున్నట్లు గుర్తించామని, పరిసరాల్లో అపరిశుభ్రత, తుప్పుపట్టిన పరికరాలు, ప్రమాదకరంగా రామెటీరియల్ నిల్వ, లేబుల్ లేకుండా పాలఉత్పత్తులు ప్యాక్ చేస్తున్నారని పేర్కొన్నా రు. పెస్ట్ కంట్రోల్ రికార్డులూ మెయింటెన్ చేయడం లేదని, నీటి నాణ్యత నివేదిక అందుబాటులో లేదని పేర్కొన్నారు. నమూనాలు, సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామ ని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలకు సురక్షితమైన ఆహారం ఇవ్వాలి
జనగామ రూరల్: నాణ్యతా ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ప్రజల కు సురక్షితమైన ఆహారం అందించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యాన శనివారం పట్టణంలో తనిఖీలు చేపట్టారు. డైన్ నైన్ రెస్టారెంట్ వంట గదితో పాటు రిఫ్రిజిరేటర్‌లోని ఫుడ్‌ను పరిశీలించా రు.సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన మాంస పు ఉత్పత్తులు, హానికర రంగులతో తయారు చేసిన తందూరి చికెన్, కాలం చెల్లిన మష్రూ మ్స్, లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన బిర్యానీ, తయారీ లో వాడే జాపత్రి, కాజు, నిషేధిత మయనిస్ ను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అనంత రం హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే క్రిమినల్ కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్స్ రోహిత్‌రెడ్డి, పి.స్వాతి, శివశంకర్‌రెడ్డి, ప్రభాకర్, వినీల్ తదితరులు పాల్గొన్నారు.
గోవర్ధనగిరి శక్తి మిల్క్ ప్రొడక్ట్స్
సెంటర్‌లో గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment