విద్యార్థులకు స్టడీ గైడ్ అందించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
● స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ
జనగామ రూరల్: నిపుణులైన గణిత ఉపాధ్యాయులు తయారు చేసిన స్టడీ గైడ్‌ను పదో తరగతి విద్యార్థులందరికీ అందజేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. త్వరలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘విజయోస్తు’ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ముద్రించిన గణితం స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్‌ను శనివారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ మెటీరియల్‌ను ఉపయోగించుకొని విద్యార్థులు గణితంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు. కార్యక్రమంలో డీఈఓ మాదంశెట్టి రమేశ్, ఏఎంఓ బొమ్మనబోయిన శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం, ప్లానింగ్ సెక్టోరియల్ అధికారి తోట రాజు, ఏసీజీఈ రవికుమార్, పరీక్షల విభాగం కార్యదర్శి చంద్రభాను, తెలంగాణ గణిత ఫోరం నుంచి ఉపాధ్యాయులు వాసుదేవరెడ్డి, లింగం, మాడిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిరాడంబరతకు
నిదర్శనం డీఈఓ రాము
● జిల్లా విద్యాధికారి రమేశ్
జనగామ రూరల్ : జనగామ ప్రాంతంలో విద్యాభివృద్ధికి పాటుపడే క్రమంలో డీఈఓ రాము నిరాడంబరత ఆదర్శనీయమని జిల్లా విద్యాధికా రి రమేశ్ అన్నారు. ఇటీవల జగిత్యాల డీఈఓగా బదిలీ అయిన రామును శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా శాఖపై తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిపిన వారి నుంచి పరిపాలనా పరమైన అనేక విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు చంద్రభాను, టి.రవికుమార్, రవీందర్, తోట రాజు, బి.శ్రీనివాస్, గౌసియా బేగం, నరసింహారావు తదితరులు పాల్గొనారు.
Comments
Please login to add a commentAdd a comment