వర్గీకరణతోనే మాదిగలకు భవిష్యత్
జనగామ రూరల్: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు వందేళ్ల భవిష్యత్ ఉంటుంది.. అనేక మార్లు పదవులు పొంది నేడు మాదిగల ఓట్ల తో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి వర్గీకరణపై మోసం చేశాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 7న జరిగే ‘వెయ్యి గొంతులు–లక్ష డప్పుల దండోరా’ మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా కేంద్రం ఎన్‌ఆర్ గార్డెన్‌లో శనివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడు పైసా రాజశేఖర్ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. వర్గీకరణకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి బాధ్యత రాష్ట్రాలకు అప్పజెప్పగా సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీని విస్మరించాడన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతికి సూర్యుడు మన కృష్ణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన కోరిక.. అమలుకు తమ వంతు సహకారం ఉంటుందని చెప్పా రు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, సుక్క రాంనర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్, డాక్టర్ సుగుణకర్‌రాజు, డాక్టర్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment