బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025
గ్రామసభల్లో గందరగోళం..
లింగాలఘణపురం: లింగాలఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో గందరగోళం నెలకొంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను ఆయా గ్రామసభల్లో చదివి వినిపించే సమయంలో చాలా మంది ప్రజలు అర్హుల పేర్లు రాలేదంటూ జాబితాను చదవనీయకుండా అడ్డుకున్నారు. లింగాలఘణపురం మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు మొదలైన గ్రామసభ 11.45 నిమిషాల వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంపీడీఓ జలేందర్‌రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ సభకు హాజరై మాట్లాడుతూ అర్హుల జాబితా ఎంపిక నిరంతర ప్రక్రియగా ఉంటుందని, ప్రజలు సహకరించాలని కోరారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment