నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా వైద్యాధికారి మధుసూదన్
కాటారం: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం పెంపొందించాలని జిల్లా వైద్యాధికారి మధుసూదన్ సూచించారు. కాటారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలు, మందుల స్టాక్ పరిశీలించి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. గ్రామాల్లో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని రోగులకు ఇబ్బందులు కలుగకుండా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని వారి ఆరోగ్య సమస్యలను పూర్తి అడిగి తెలుసుకొని సరైన వైద్యం చేయాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట పీహెచ్‌సీ వైద్యురాలు మౌనిక, వైద్యులు హారిక, గీత, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment