మాయమాటలు నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

మాయమాటలు నమ్మొద్దు

Published Tue, May 7 2024 6:15 AM

మాయమాటలు నమ్మొద్దు

గద్వాల రూరల్‌: అబద్దాలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. మరోసారి పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఇవే గ్యారంటీలతో ముందుకొస్తుందని.. ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా సోమవారం జిల్లా కేంద్రంలోని 32,33వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలోనే గద్వాల పట్టణంలోని ప్రతి వార్డులో డ్రైనేజీ వ్యవస్ధ, సీసీ రోడ్డు, కమ్యూనిటీ హల్స్‌, పట్టణ ప్రకృతి వనాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు 24గంటల విద్యుత్‌ సరఫరా చేసేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో విద్యుత్‌ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అదేవిధంగా పదేళ్ల బిజేపీ పాలనలో కుల, మతాల చిచ్చుపెడుతూ, నిత్యావసర ధరలు పెంచి సామాన్యులపై అధిక భారం మోపిన బిజేపీకి బుద్దిచెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిని ఆశీర్వాదించాలని కోరారు. కృష్ణారెడ్డి, బాబర్‌, నరహరి శ్రీనివాసులు, సాయిశ్యామ్‌ రెడ్డి ఉన్నారు.

జాబ్‌మేళా

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఎన్టీఆర్‌ మహి ళా డిగ్రీ కళాశాలలో పలు ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించారు. వివిధ కళాశాలల నుంచి మొత్తం 450 మంది ఔత్సాహికులు హాజరవగా.. ఇందులో 125 మంది పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement