యువత క్రీడల్లో రాణించాలి
ఎర్రవల్లి: యువత క్రీడల్లో రాణించాలని.. ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం ఎర్రవల్లిలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడం కోసం ఎర్రవల్లిలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. యువత ముందుండాలనే ఆలోచన మరియు సంకల్పంతో ముందుకు వచ్చిన బహుమతి దాతలు జోగుల రవి, సరస్వతిని ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్‌ఎస్ పాలనలో యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు. వ్యాయామంపై యువత ముందుండి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు మండల కేంద్రం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టేడియం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు దీపక్ ప్ర/్ఞ, డీవైఓ ఆనంద్, మార్కెట్‌యార్డు చైర్మెన్ దొడ్డెప్ప, నాయకులు జోగుల రవి, వెంకటేష్ యాదవ్, కుమార్, రాజ్‌కుమార్, శ్యామ్, సరస్వతి, రుక్మాందర్‌రెడ్డి, ఈదన్న, రాము, వెంకటేష్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment