రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభకనబరిచి విజేతగా నిలవాలని జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వచ్చే నెల 7 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఎంపికలకు జిల్లావ్యాప్తంగా 36 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారని, వీరిలో 14 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశామన్నారు. వీరికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 వరకు మెయిన్ స్టేడియంలో ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. క్యాంపులో ప్రతిభ కనబరిచిన వారిని తుది జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పారు. జిల్లా కబడ్డీ సంఘం కోశాధికారి ఉమామహేశ్వర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి బాలరాజు, సీనియర్ క్రీడాకారులు పాపారాయుడు, రామచంద్రయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు.
జిల్లా మహిళా ప్రాబబుల్స్..
వి.జ్యోత్స్న, సంగీత, జె.మౌనిక, ఎన్.శిరీష, వి.పార్వతి, ఎం.నందిని, జె.గంగ, పి.సింధూజ, వి.ఇందుబాయి, కె.మౌనిక, ఎస్.మనీష, డి.లక్ష్మి, జె.ఇందుప్రియ, ఎం.గాయత్రి ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment